హాయ్ ఫ్రెండ్స్...
ఏంటి మరి ఇవాళ అందరూ మీ ఇంట్లోకి చిట్టి చిట్టి పాదాలు ముగ్గులు వేసి కృష్ణుణ్ణి ఆహ్వానించారా? ఉట్టి కొట్టారా?
Did u dress up ur kids in Radha Krishna costumes and presented them lots of butter like this ? How did u celebrate the day?
ఓ నా నేస్తం...!!
Thursday, September 2, 2010
Wednesday, September 1, 2010
జన్మాష్టమి...!
జన్మాష్టమి శుభాకాంక్షలు...!!
కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం...!
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంటేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి...!!
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం...!
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంటేచ ముక్తావళిం
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి...!!
శ్రీ కృష్ణుని పేరు చెబితే వెంటనే గుర్తుకువచ్చేవి ఆయన చేసిన చిలిపి పనులు, ఆడిన అల్లరి ఆటలు, రాధాకృష్ణుల ప్రణయం, గీతాబోధనలు... అంతంటి పరమాత్మ పుట్టిన రోజు శ్రావణ బహుళ అష్టమి తిధి రోహిణి నక్షత్రం. అదే శ్రీకృష్ణాష్టమి, జన్మాష్టమి. ఈ రోజున అందరూ తమ తమ ఇళ్ళముందు చిన్ని చిన్ని కృష్ణ పాదాలు ముగ్గులుగా చిత్రించి ఆ చిన్ని కృష్ణుని రాకకై వేచి చూస్తారు. ఆయన కోసం వెన్న, మీగడ, పాల అటుకులు తిని వెళ్తాడని నమ్మకం. ఈ రోజు జరిగే ఇంకో వేడుక ఉట్ల ఉత్సవం. ఒకరి మీద ఒకరు ఎక్కి ఆ ఉట్లను కొట్టడం అంటే ఆనంద కోలాహలమే ప్రతి ఒక్కరికి.
స్త్రీ రూపంలో ఉండే పురుష విగ్రహం ఆ శ్రీకృష్ణపరమాత్మది. మెడ, నడుమ, పాదం అనే మూడు చోట్ల ఒంపు తిరిగిన విగ్రహం ఈయనిది. ముగ్ధమోహన సౌందర్యము గలవాడు ఆ కృష్ణయ్య. చెవి నిండుగా మాధుర్యాన్ని నింపే చక్కని వేణుగానం అలా తెరలు తెరలుగా గాలిలో సాగుతూ ఎక్కడెక్కడివారినీ ఊయలలూగించి ఆనందడోలికలలో తెలియాడించేది ఈయన మురళీ ధ్వని. ఏ రాజరికం లేకున్నా, ఎప్పుడూ చక్కని వస్త్రధారణలో నిత్యం హారాలతో కనిపించే నిండైన విగ్రహం ఈయనిది.
ఆ కృష్ణపరమాత్మునికి అనేక నామాలు... వాసుదేవుడు, దేవకీ తనయుడు, బాలకృష్ణుడు, నంద సుతుడు, యశోదా తనయుడు, గోవర్ధన గిరిధారి, కాళీయమర్ధనుడు, గోపికా వల్లభుడు, నవనీత చోరుడు, రుక్మిణీపతి, సత్యభామా ప్రియుడు, కంసారి, గీతాచార్యుడు, గోపాలకృష్ణుడు... ఇలా అందరి హృదయాలను ఆకర్షించే ఆయనికి అనేకానేక పేర్లు.
శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం (ఎనిమిదవ అవతారం). అపరిమితానందాన్ని(పరిమితం లేని) పంచి ఇచ్చిన అవతారం. వెర్రి గొల్లడుగా, వెన్నను కాజేసే దొంగగా, వలపుకాడుగా, వేదాంత వేద్యుడుగా, మహాభారత సంధాతగా, చతురుడిగా, చమత్కారిగా, గీతాచార్యుడిగా, రాజనీతిజ్ఞుడుగా శ్రీకృష్ణుడు రాసావతారమూర్తిగా దర్శనమిస్తాడు.
నిత్య సంతోషి... ఆ మహాభోగుడు శ్రీకృష్ణపరమాత్మ...!!
నా గురించి... నా ఈ బ్లాగ్ గురించి...
ఓ మిత్రమా,
నా పేరు ప్రియ. ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న నా బ్లాగ్ ఈ రోజుకి మొదలు పెట్టగలిగాను. ఈ "నాప్రియనేస్తం" బ్లాగ్ ద్వారా మీ అందరికి మంచి మిత్రురాలిగా ఉండాలని కోరుకుంటున్నాను. రోజూ ఉరుకుల పరుగులతో, మనిషిని మనిషి పలకరించుకునే తీరికలేని ప్రపంచంలో బతుకుతోన్న మనకు హాయిగా, కొంతసేపైన తీరికగా, తనివితీరా సేదతీరి ఆనందించే విధంగా ఈ బ్లాగ్ మీకు కొంతైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ...
మీ అభిప్రాయలు కూడా జోడించి మరింత అందంగా మలిచే వీలు కల్పిస్తారని ఆశిస్తూ...
మీ ప్రియ నేస్తం... :)

Subscribe to:
Posts (Atom)